సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకల్లో షారుఖ్ సందడి

సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకల్లో షారుఖ్ సందడి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇవాళ 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు. హ్యాపీ బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులే కాకుండా సినీ, ఇతర రంగాలకు చెందిన వారు విషెస్ తెలియచేస్తున్నారు. సోమవారం రాత్రి సల్మాన్ సోదరి తన ఇంట్లో నిర్వహించిన పార్టీకి పలువురు స్టార్స్ పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  పార్టీలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ కలిసి ఒకచోట కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.

పార్టీ అనంతరం షారుఖ్ ను సల్మాన్ స్వయంగా బయటకు తీసుకొస్తుండగా కెమెరాలు క్లిక్ అనిపించాయి. ఈ పార్టీలో పలువురు హీరోలు, హీరోయిన్స్ సందడి చేశారు. ఇక సల్లూ భాయ్ సినిమాల విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు రీమేక్ లో ‘కిసికా భాయ్ కిసికి జాన్’ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.