షారూఖ్ ఖాన్‌‌ కు డాక్టరేట్..

షారూఖ్ ఖాన్‌‌ కు డాక్టరేట్..

మెల్ బోర్న్: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఆస్ట్రేలియాలోని  మెల్బోర్న్  బేస్డ్ లా ట్రోబ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. మీర్ ఫౌండేషన్ ద్వారా మహిళల హక్కులు, నిరుపేద పిల్లల కోసం ఆయన చేసిన కృషి, సినిమాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ట్రోబ్ వర్సిటీ షారూఖ్ ను డాక్టరేట్ తో సత్కరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 10వ ఎడిషన్ కార్యక్రమంలో షారూఖ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఉమెన్ ఈక్వాలిటీ కోసం పాటుపడే లా ట్రోబ్ లాంటి వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నానని, వర్సిటీకి థాంక్స్ చెబుతూ సోమవారం ట్వీట్ చేశారు.