జెర్సీ వాయిదా పడింది

జెర్సీ వాయిదా పడింది

మొన్నటి వరకు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులన్నీ పోటీపడి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడేమో ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్విరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోన్ అవుతోందంటూ రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదింకా కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ కాకముందే ‘జెర్సీ’ చిత్రం వాయిదా పడింది. డిసెంబర్ 31న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ మహారాష్ట్రలో యాభై శాతం ఆక్యుపెన్సీయే ఉండటం, మరోవైపు కరోనా ఎఫెక్ట్ పెరిగిపోతూ ఉండటంతో ప్రస్తుతానికి రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ‘జెర్సీ’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అదే దర్శకుడు అదే పేరుతో హిందీలో తీశాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ నిర్మించారు. 2019లో మొదలైన ఈ సినిమాకి కరోనా అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఎట్టకేలకి రిలీజవుతోంది అనుకుంటే సరిగ్గా మూడు రోజుల ముందు మళ్లీ వాయిదా పడటం అందరినీ డిజప్పాయింట్ చేసింది. మళ్లీ ఎప్పటికి లైన్ క్లియరవుతుందో చూడాలి మరి.