
డాక్టర్, డాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న శివకార్తికేయన్‌కి తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఇదొక ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు రీసెంట్‌గా ప్రకటించారు. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ బ్యాక్‌డ్రాప్స్‌లో ఉంటుంది. ఇటీవలే పాండిచ్చేరి షూట్ పూర్తి చేశారు. దీంతో తొంభై శాతం షూటింగ్ కంప్లీటయ్యింది. ఉక్రెయిన్ నటి మరియా రయబోషాప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, శాంతి టాకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శివ కార్తికేయన్‌కి ఇది ఇరవయ్యో సినిమా. ఇతర అప్‌డేట్స్ త్వరలో రివీల్ చేస్తామని చెప్పారు నిర్మాతల్లో ఒకరైన సురేష్‌బాబు.