- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిమార్పు ఉండదు
- సోషల్ మీడియా ట్రాప్‌లో పడొద్దు బీజేపీ జాతీయ నేత శివ ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలెవరూ సోషల్ మీడియా ట్రాప్‌లో పడొద్దని ఆ పార్టీ జాతీయ సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్ సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మారుస్తారని, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారనేది దుష్ప్రచారమని స్పష్టం చేశారు. ఇదంతా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారమని, బీజేపీ నేతలెవరూ పట్టించుకోవద్దని సూచించారు. ప్రత్యర్థులు పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్నారని చెప్పారు. నిజమైన బీజేపీ కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలు పట్టించుకోరని పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున నేతలు ఫొటోల కోసం కాకుండా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు.

