సెరెనాపై గెల్చిన హర్మొనీ టాన్

సెరెనాపై గెల్చిన హర్మొనీ టాన్

లండన్‌‌‌‌‌‌‌‌‌‌: గాయం నుంచి కోలుకొని, ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అమెరికా టెన్నిస్‌‌‌‌ గ్రేట్‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌కు షాక్‌‌‌‌. 24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌పై గురి పెట్టి వింబుల్డన్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో బరిలోకి దిగిన సెరెనాకు  తొలి రౌండ్‌‌‌‌లోనే  చుక్కెదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో 113వ ర్యాంకర్‌‌‌‌ హర్మొనీ టాన్ 7–5, 1–6, 7–6 (10/7)తో సెరెనాను ఓడించి సంచలనం సృష్టించింది. వింబుల్డన్‌‌‌‌లో తన తొలి మ్యాచ్‌‌‌‌లోనే లెజెండరీ ప్లేయర్‌‌‌‌పై గెలిచి ఔరా అనిపించింది. మ్యాచ్‌‌‌‌లో మునుపటి వేగాన్ని చూపెట్టలేకపోయిన 40 ఏండ్ల సెరెనా తొలి సెట్‌‌‌‌ను  కోల్పోయినా రెండో సెట్‌‌‌‌ను ఈజీగా గెలిచింది. మూడో సెట్​ సూపర్​ టై బ్రేక్​కు వెళ్లగా. ఆక్కడ విలియమ్స్​ వరుసగా 4 పాయింట్లతో 4–0తో ఆధిక్యం సాధించింది.  కానీ, అద్భుతంగా పుంజుకున్న టాన్‌‌‌‌  మ్యాచ్​ నెగ్గింది.  వింబుల్డన్‌‌‌‌లో ఓడినప్పటికీ కెరీర్‌‌‌‌ కొనసాగిస్తానని సెరెనా చెప్పింది. ఇక,  రెండో సీడ్‌‌‌‌ అనెట్‌‌‌‌ కొంటావీట్‌‌‌‌, పదో సీడ్‌‌‌‌ ఎమ్మా రదుకానుకు కూడా నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన రెండో రౌండ్‌‌‌‌లో అనెట్‌‌‌‌ (ఇస్తోనియా) 4–-6, 0–-6తో జుల్‌‌‌‌ నీమైర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. కరోలిన్‌‌‌‌ గార్సియా (ఫ్రాన్స్‌‌‌‌) 6-–3, 6-–3తో రదుకాను (బ్రిటన్‌‌‌‌)కు షాకిచ్చింది.12వ సీడ్‌‌‌‌ ఒస్తపెంకో (లాత్వియా), 15వ సీజ్‌‌‌‌ కెర్బర్‌‌‌‌ (జర్మనీ) సునాయాస విజయాలతో మూడో రౌండ్‌‌‌‌లో అడుగు పెట్టారు.

మూడో రౌండ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో టాప్​ సీడ్​ జొకోవిచ్​ (సెర్బియా) 6–1, 6–4, 6–2తో కొకినకిస్‌‌‌‌ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు. కానీ,మూడో సీడ్‌‌‌‌ రూడ్‌‌‌‌ (నార్వే)  6–3, 2–6, 5–7, 4–6తో హంబర్ట్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) చేతిలో ఓడాడు.