
- బెస్ట్ ఫీమేల్ అథ్లెట్‌గా జ్యోతి
భువనేశ్వర్: ఇండియా టాప్ షాట్ పుట్టర్ తేజిందర్ పాల్ తూర్ తన పేరిట ఉన్న ఆసియా రికార్డును బ్రేక్ చూస్తూ వరల్డ్ చాంపియన్స్‌షిప్స్‌కు క్వాలిఫై అయ్యాడు. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మెన్స్ షాట్ పుట్‌లో తేజిందర్ 21.77 మీటర్లు త్రో చేసి టాప్ ప్లేస్‌తో గోల్డ్ నెగ్గాడు. దాంతో 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్ చాంపియన్‌షిప్స్ క్వాలిఫైయింగ్ 21.40 మీటర్లు కూడా దాటాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడలకు కూడా మరోసారి అర్హత సాధించాడు. పంజాబ్‌కే చెందిన కరణ్‌వీర్ సింగ్ 19.78 మీటర్లతో రెండో ప్లేస్‌లో నిలిచి ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యాడు. ఇక, 100 మీ. రన్, 100 మీ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్స్ నెగ్గిన ఏపీ అమ్మాయి యెర్రాజీ జ్యోతి బెస్ట్ ఫీమేల్ అథ్లెట్ అవార్డు నెగ్గింది.