- పంత్‌కు ఏమైంది..?
- సౌతాఫ్రికాతో రెండు టెస్టుల్లోనూ ఫెయిల్
- షాట్ సెలెక్షన్‌లో పొరపాట్లు
- సాహాకు చాన్స్ ఇవ్వాలంటున్న మాజీ ప్లేయర్లు
సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచే గొప్ప చాన్స్‌ను టీమిండియా సెకండ్ టెస్ట్‌లో చేజేతులా వేస్ట్ చేసుకుంది..! ఇందులో పరిస్థితుల ప్రభావం కంటే.. బ్యాటర్ల తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి..! ముఖ్యంగా ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు చెత్త షాట్లకు ఔట్‌కావడం ఇండియా స్కోరును తీవ్రంగా ప్రభావితం చేసింది..! ఒకప్పుడు మ్యాచ్ విన్నర్‌గా తానేంటో చూపెట్టిన పంత్‌కు ఇప్పుడు ఏమైంది? టీమ్ కోసం కాకుండా తన కోసం ఆడుతున్నట్లుగా కనిపిస్తున్న అతనికి బ్రేక్ ఇచ్చి.. సాహాకు చాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి..!!
జొహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌లో టెంబా బవూమ క్యాచ్‌ను శార్దూల్ ఠాకూర్ డ్రాప్ చేయడం, మంచి స్టార్ట్ లభించినా ఇండియా 202 రన్స్‌కే కుప్పకూలడం.. సెకండ్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ఈ రెండు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి వల్లే మ్యాచ్ ఇండియా చేజారిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కొద్దిగా లోతుగా ఆలోచిస్తే.. ఓటమికి ప్రధాన కారణం మన బ్యాటర్లు అనేది స్పష్టమవుతుంది. ఇందులో అతి ప్రధానంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఔటైన విధానంపైనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. తను రెండు టెస్టుల్లోనూ ఫెయిలయ్యాడు. పైగా, రెండో మ్యాచ్ అద్భుతంగా సాగుతున్న టైమ్‌లో.. పంత్ షాట్ సెలెక్షన్ ఇండియాను ఘోరంగా దెబ్బతీసింది. రబాడ మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిసినా.. పంత్ కొట్టిన నిర్లక్ష్యపు షాట్ల వల్లే స్కోరు బోర్డుపై తీవ్రంగా ప్రభావం చూపింది. సోషల్ మీడియాలో పంత్‌పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మాజీలు కూడా గొంతు కలిపారు. చీఫ్ కోచ్ ద్రవిడ్.. పంత్‌తో కాస్త గట్టిగా మాట్లాడాల్సిందేనని బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గావస్కర్ అన్నాడు. అలాగే పుజారా కొన్ని షాట్లను వదిలేస్తే మ్యాచ్ మరోలా ఉండేదని సన్నీ అభిప్రాయపడ్డాడు.
దూకుడుగా ఆడితేనే..
మరోవైపు ఈ విషయంలో ద్రవిడ్ వాదన మరో రకంగా ఉంది. పంత్ దూకుడుగా ఆడే సక్సెస్ అయ్యాడని చీఫ్ కోచ్ స్పష్టం చేశాడు. ‘రిషబ్ ఫలానా పద్ధతిలో ఆడతాడని తెలుసు. అలా ఆడటం వల్లే అతను సక్సెస్ అయ్యాడు. కానీ షాట్ సెలెక్షన్ విషయంలో ఓసారి చర్చించాల్సింది. అయితే దూకుడు తగ్గించమని ఎవరికీ చెప్పలేం. అయినప్పటికీ అతనికి మరికొంత టైమ్ ఇవ్వాలి’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇదే పాయింట్‌తో మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా కూడా ఏకీభవించాడు. లాస్ట్ ఇయర్ గబ్బాలో రిషబ్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘పంత్ కుదురుకోవడానికి ఫస్ట్ 50 బాల్స్ చాన్స్ ఇవ్వాలి. ఒక్కసారి కండీషన్స్‌కు అలవాటు పడితే ఆ తర్వాత షాట్లు కొట్టడానికి ఈజీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ విషయాన్ని పంత్ మిస్ అవుతున్నాడు. పంత్‌లాంటి ప్లేయర్ క్రీజులోకి వచ్చాడంటే కొద్దిగా కంట్రోల్‌లో ఉంచాలి. నేచురల్ టాలెంట్‌ను కొద్దిగా తగ్గించేందుకు ట్రై చేయాలి. ద్రవిడ్ ఆడే రోజుల్లో ఇలాంటి ట్యాలెంటెడ్ ప్లేయర్లను చాలా హ్యాండిల్ చేశాడు. సెహ్వాగ్ కూడా స్టార్టింగ్‌లో ఇలాంటి షాట్సే ఆడేవాడు. కానీ ఎక్స్‌పీరియెన్స్ వచ్చాక షాట్ సెలెక్షన్ చాలా బెటర్ అయ్యింది. కాబట్టి డిఫికల్ట్ టైమ్‌లో డిఫెన్స్ ఎలా ఆడాలో పంత్‌కు కూడా నేర్పాలి’ అని దీప్‌దాస్ వెల్లడించాడు.
బ్రేక్ ఇవ్వాలి..
పంత్ షాట్ సెలెక్షన్‌పై మాజీ క్రికెటర్ మదన్‌లాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అవసరమైతే పంత్‌కు బ్రేక్ ఇచ్చి వృద్ధిమాన్ సాహాను తీసుకురావాలని సూచించాడు. ‘పంత్ అగ్రెసివ్ గేమ్.. గతంలో కొన్ని మ్యాచ్‌లు గెలిపించి ఉండొచ్చు. కానీ అదే ఆట ఇప్పుడు డకౌట్ అయ్యేలా చేసింది. ఇలాంటి చెత్త షాట్లు అన్నిసార్లు పనికి రావు. అందుకే సాహాను తీసుకురావాలి. అతను సెన్సిబుల్ బ్యాటర్. మంచి వికెట్ కీపర్ కూడా. అదే టైమ్‌లో టెస్టుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో పంత్ నేర్చుకోవాలి. మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ఇలాంటి షాట్స్ ఆడొచ్చా. మన కోసం కాకుండా టీమ్ కోసం బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది’ అని లాల్ చురకలు అంటించాడు. ఓవరాల్‌గా తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలంటే.. కనీసం కేప్‌టౌన్ టెస్ట్‌లోనైనా పంత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే.

