వీడియో: ప్రేమ పక్షులు.. ఒకే చోట సారా, శుబ్‌మాన్‌ గిల్‌

 వీడియో: ప్రేమ పక్షులు.. ఒకే చోట సారా, శుబ్‌మాన్‌ గిల్‌

భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్, భారత యువ క్రికెటర్ శుబ్‌మన్‌ గిల్‌ ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం అని చెప్పలేం.. రూమర్లని కొట్టిపారేయలేం. ఏమో! మనం రాసే కథనాలే వీరిని కలపొచ్చు. ఈ పుకార్లే వారిని దగ్గర చేయొచ్చు. 

తాజాగా, వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కంట పడ్డారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కలల ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిల్‌, సారా కనిపించారు. సారా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతుండగా.. గిల్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ధరించాడు. గిల్‌ ఎంట్రెన్స్‌ గేట్‌ నుంచి బయటకు వస్తుండగా.. సారా తన స్నేహితులతో ఎంట్రీ గేట్‌ వద్ద కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీలంకతో

భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్‌ 2న ముంబై, వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. అందువల్ల భారత జట్టు ప్రస్తుతం ముంబైలో ఉంది. ఈ  క్రమంలోనే గిల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇక ఏడాదికాలంగా మంచి ఫామ్ కనబరిచిన గిల్ మెగా టోర్నీలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ 4 మ్యాచ్‌ల్లో 104 పరుగులు మాత్రమే చేశాడు.