Shubman Gill: ఫ్యాన్ అడిగినందుకు డేటింగ్ యాప్ తెరిచిన గిల్

Shubman Gill: ఫ్యాన్ అడిగినందుకు డేటింగ్ యాప్ తెరిచిన గిల్

టీమిండియా యంగ్ స్టర్ శుభ్ మన్ గిల్ టిండర్ డేటింగ్ యాప్ లో ఖాతా తెరిచాడు. తన ఫ్యాన్ అడిగినందుకు ఈ అకౌంట్ తెరిచానని గిల్ అంటున్నాడు. దీనివెనుకున్న అసలు కథేమిటంటే.. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో ఒక మహిళ ‘టిండర్.. శుభ్ మన్ సే మ్యాచ్ కర్ దో (జతచేయి)’ అంటూ హోర్డింగ్ పట్టుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ మహిళ ఫొటోలతో టిండర్.. ‘శుభ్ మన్ ఇక్కడ చూడు’ అంటూ నాగ్ పూర్ లో హోర్డింగ్ లు ఏర్పాటుచేసింది. 

ఆ హోర్డింగ్ ఫొటోలను టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి గిల్ ని ఆట పట్టించాడు. ‘గిల్ ఒకసారి చూడు. మొత్త నాగ్ పూర్ చెప్తోంది’ అంటూ క్యాప్షన్ రాశాడు. దీనిపై స్పందించిన గిల్ల ఎట్టకేలకు టిండర్ లో ఖాతా తెరిచాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో వీడియో పోస్ట్ చేసి వెల్లడించాడు.