కరోనా ఎఫెక్ట్:  రాకెట్‌ ప్రయోగ కేంద్రం షార్ మూసివేత

కరోనా ఎఫెక్ట్:  రాకెట్‌ ప్రయోగ కేంద్రం షార్ మూసివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై చూపిస్తోంది. కరోనా భయంతో ఇప్పటికే దాదాపు అన్ని సంస్థలు మూతపడ్డాయి. ఆయా సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ ధాటికి శ్రీహరికోటలోని అంతరిక్షకేంద్రం షార్ కూడా మూతపడింది. ఈ నెల 31 వరకు రాకెట్‌ ప్రయోగ కార్యక్రమాలు అన్ని కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రమే హజరుకావాలని ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పాటు షార్‌ కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.