
డీజే టిల్లు సక్సెస్ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (SidduJonnalagadda). ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్గా వస్తున్న టిల్లు స్క్వేర్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో..ఈ సినిమా తరువాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేశారు. ఇవాళ సిద్దు జొన్నలగడ్డ బర్త్డే స్పెషల్గా SVCC37 గా రాబోతున్న మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
లేటెస్ట్గా బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar)తో సిద్దూ చేస్తున్న నెక్స్ట్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు 'జాక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. జాక్కు..'కొంచెం క్రాక్' అనే క్యూరియాసిటీ ట్యాగ్ ఇచ్చారు. రిలీజ్ చేసిన వీడియోలో..'స్టార్ బాయ్ టీ షర్ట్తో..రెండు చేతుల్లో విభిన్నమైన గన్స్' పట్టుకున్న టిల్లు స్టిల్ ఆసక్తిగా ఉంది.
Double the guns, double the fun! ? #SidduJonnalagadda is set to take you all on a quirky ride as #JACK - Konchem Krack?
— SVCC (@SVCCofficial) February 7, 2024
Motion Poster - https://t.co/7BEdNcadQA#HBDSidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial pic.twitter.com/2MsT1eL0Zb
ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. బ్లాక్ డ్రెస్లో ముస్లిం పాత్రలో కనిపిస్తున్న వైష్ణవి ఫస్ట్ లుక్ ఆడియన్స్కు తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్(SVCC) బ్యానర్లో రాబోతున్న 37 వ సినిమా ఇది.
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్షన్ లో ‘తెలుసు కదా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సిద్దుకి జోడీగా రాశీ ఖన్నా,శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.