
పగలు ఎండలు ఠారెత్తితుస్తాయి. బాడీ కూల్ గా ఉండేందుకు జనాలు బీర్ షాపుల వైపు పరిగెడుతున్నారు. కూల్ కూల్ గా బీరు తాగాలని బాటిల్ కొనుకున్న ఓ వ్యక్తి షాక్ కుగురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే....
హైదరాబాద్ అన్నోజిగూడలోని SVD వైన్ షాపులో ఓ వ్యక్తి బీర్ బాటిల్కొనుగోలు చేశాడు. కొంత సేపటి తరువాత తాగుదామని బీర్ బాటిల్ ను పరిశీలించగా అందులో సిలవర్ పేపర్ ఉందని గమనించాడు. ఇక వెంటనే షాక్ కు గురయిన వ్యక్తి.. షాపు యజమానిని అడిగాడు. SVD వైన్ షాపు యజమాని మాకు ఏమి తెలియదని చెప్పాడని బాధితుడు తెలిపాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.