సింగరేణిలో 177 క్లర్కు పోస్టులు

సింగరేణిలో 177 క్లర్కు పోస్టులు
  • భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • 20 నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌(క్లర్కు) పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదలైంది. సీఎండీ ఎన్‌‌‌‌‌‌‌‌.శ్రీధర్‌‌‌‌‌‌‌‌ ఆదేశం మేరకు  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పర్సనల్‌‌‌‌‌‌‌‌ బలరామ్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఖాళీలను గుర్తించి ఎక్స్‌‌‌‌‌‌‌‌ టర్నల్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. వివరాలను www.scclmines.com లో చూడొచ్చు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఐదేండ్ల మినహాయింపు ఉంది. దరఖాస్తులను 20 నుంచి ఆన్​లైన్​లో స్వీకరిస్తామని, జులై 10 చివరి తేదీ అని బలరామ్ తెలిపారు.