- కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని కార్మిక సంఘాల జేఏసీ స్టేట్ లీడర్లు ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా శుక్రవారం నుంచి కార్మికులు సమ్మెలో దిగారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో జేఏసీ లీడర్లు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు.
జేఏసీ రాష్ట్ర, జిల్లా లీడర్లు గుత్తుల సత్యనారాయణ, ఎర్రగాని కృష్ణయ్య, ఇనుమూరి నాగేశ్వరరావు, కె. నాగభూషణం, యాకూబ్షావళి, పి. సతీశ్, సురేందర్, వీరన్న, నిర్మల పాల్గొన్నారు. సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, కాంగ్రెస్ లీడర్లు ఎడవల్లి కృష్ణ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ లీడర్లు జలీల్ సంఘీభావం ప్రకటించారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో నాయకులు రాసూరి శంకర్, వెంకటేశ్వర్లు, కరుణాకర్ పాల్గొన్నారు.
