Rishabh Pant: అప్పుడేమో KL రాహుల్, ఇప్పుడు రిషబ్ పంత్ను ఘోరంగా అవమానించిన లక్నో ఓనర్ 

Rishabh Pant: అప్పుడేమో KL రాహుల్, ఇప్పుడు రిషబ్ పంత్ను ఘోరంగా అవమానించిన లక్నో ఓనర్ 

Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, తన జట్టు ఆటగాళ్లతో వ్యవహరించే తీరు మొదటి నుంచి వివాదస్పదంగా మారింది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఉన్నప్పుడు ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి, స్టీవ్ స్మిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించిన సంజీవ్ గోయెంకా. ఆ తర్వాత 2024 సీజన్‌లో స్టేడియంలోనే కేఎల్ రాహుల్‌ని తిట్టడంతో వివాదాల్లో నిలిచాడు. అయినా అతని పద్ధతిని ఏ మాత్రం మార్చకోలేదు. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్‌పై అతడు సీరియస్ అయ్యాడు. 

 ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీతో ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే 
ఢిల్లీ ఛేదించింది. ఆరంభంలో లక్నో బౌలర్లు వెంటవెంటనే 4 వికెట్లు తీసినప్పటికీ.. సమీర్ రిజ్వీ ( 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 70 పరుగులు) , ట్రిస్టన్ స్టబ్స్ ( 32 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సులతో 39 పరుగులు)  కలిసి 119 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ని సక్సెస్ ఫుల్ గా ముగించేశారు. 

రిషబ్ పంత్‌తో సీరియస్ చర్చలు: 
ఈ ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్‌తో గ్రౌండ్‌లో సీరియస్‌గా చర్చించడం కెమెరాల్లో కనిపించింది. వాళ్లేం మాట్లాడుకున్నారో వినిపించకపోయినా సంజీవ్ , రిషబ్ పంత్‌కి ఏదో చూపిస్తూ సీరియస్‌గా చెప్పడం, దానికి అతను ముఖం చిన్నబుచ్చుకోవడం నెట్టింట వైరల్ గా మారిన వీడియోల్లో కనిపిస్తుంది. జట్టు పర్ఫామెన్స్ కారణంగా సంజీవ్ గోయెంకాకి కోపం రావడంలో తప్పు లేదు, కానీ ఇలా గ్రౌండ్‌లోకి వచ్చి మరీ ఇంటర్నేషనల్ క్రికెటర్‌ని ఘోరంగా అవమానించడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేశామని.. ఎన్ని తిట్టినా భరించాలని అనుకునే కార్పరేట్ పద్ధతి, జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌కి సెట్ కాదనే విషయాన్ని సంజీవ్ గోయెంకా గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

గతంలో కేఎల్ రాహుల్‌ని తిట్టిన సంజీవ్: 
2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో, 165  పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొట్టిన కొట్టుడికి ఈ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఊదేసింది సన్‌రైజర్స్. ఈ మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, స్టేడియంలోనే అప్పటి లక్నో టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని తిట్టడం సంచలనంగా మారింది. 

సంజీవ్ గోయోంకా తీరుపై విమర్శలు: 
ఈ ఘటన తర్వాత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అందరూ కూడా సంజీవ్ గోయెంకా తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బులు పెట్టినంత మాత్రాన, అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్‌ని ఇలా మైదానంలో ప్రేక్షకులందరి ముందు చివాట్లు పెట్టి, అవమానించడం మంచి పద్దతి కాదని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బ్యాడ్ అయిపోవడంతో కేఎల్ రాహుల్‌ని ఇంటికి పిలిచి, డిన్నర్ ఏర్పాటు చేసి సంజీవ్ గోయెంకా ‘సారీ’ చెప్పగా.. అందరి ముందు తిట్టి, ప్రైవేటుగా సారీ చెబితే చెల్లిపోతుందా? అందుకే ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌ని వీడి, ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీ ఆఫర్ చేసినా గత అనుభవం కారణంగానే సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి కేఎల్ రాహుల్ ఇష్టపడలేదు. 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగులు చేసి, ఢిల్లీ క్యాపిటల్స్‌ని విజయం అందించాడు. మ్యాచ్ తర్వాత సంజీవ్ గోయెంకా  మాట్లాడడానికి ప్రయత్నించినా.. రాహుల్ పట్టించుకోకపోవడం కెమెరాల్లో కనిపించింది. కానీ ఈసారి సంజీవ్ గోయెంకా తీరు మార్చుకోకపోతే రిషబ్ పంత్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి జంప్ కావడం ఖాయమంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.