Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ, ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో తెగ సందడి చేశారు. స్టేడియంలో ఎంత సీరియస్‌గా ఉంటారో, బయట అంత సరదాగా ఉండే కోహ్లీ.. ఆర్సీబీ చేస్తున్న ప్రాక్టీస్ సెషన్‌లో తన సహచర ఆటగాడు రోమారియో షెపర్డ్ బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ అక్కడ ఉన్న వారందరినీ బాగా నవ్వుకునేలా చేశాడు.
షెపర్డ్‌ను ఇమిటేట్ చేసిన కోహ్లీ:
విరాట్ కోహ్లీకి ఆటగాళ్లను అనుకరించడం (Mimicry) కొత్తేమీ కాదు. గతంలో సౌరభ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలను ఇమిటేట్ చేసిన కింగ్, ఇప్పుడు వెస్టిండీస్ పవర్ హిట్టర్ రోమారియో షెపర్డ్ ని చేశాడు. కాగా షెఫర్డ్ క్రీజులో నిలబడే తీరును, బంతిని బాదేటప్పుడు అతడు ప్రదర్శించే ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ను కోహ్లీ అచ్చుగుద్దినట్లుగా చేసి చూపించారు. అలాగే ఐపీఎల్ లాంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో ఇలాంటి సరదా క్షణాలు జట్టు సభ్యుల మధ్య ఒత్తిడిని తగ్గించి, ఐకమత్యాన్ని పెంచుతాయి. కోహ్లీ చేసిన ఈ హంగామా నెట్టింట వైరల్ కావడంతో, ఆర్సీబీ అభిమానులు "కింగ్ ఈజ్ బ్యాక్ విత్ హిస్ హ్యూమర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జట్టులో జోష్ నింపుతున్న విరాట్:
మైదానంలో డ్యాన్స్‌లు వేయడం, అభిమానులతో సరదాగా గడపడం విరాట్ కోహ్లీకి అలవాటే. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ ప్రస్తుత ఆర్సీబీ జట్టులో కోహ్లీ కేవలం ఒక సీనియర్ బ్యాటర్‌గానే కాకుండా, జట్టులో ఉత్సాహాన్ని నింపే ఒక 'ఎంటర్‌టైనర్'గా కూడా కనిపిస్తున్నారు. రోమారియో షెఫర్డ్ లాంటి యంగ్ హిట్టర్లతో కోహ్లీకి ఉన్న ఈ సాన్నిహిత్యం జట్టు బాండింగ్‌ను మరింత బలోపేతం చేస్తోంది. అయితే మైదానంలో ప్రదర్శనలు ఎంత ముఖ్యమో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం కూడా అంతే ముఖ్యం. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి, కోహ్లీలోని ఈ 'చిలిపి కోణం' ప్లేయర్స్ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
The way Phil Salt walked away — he knew he was next, as Virat Kohli was imitating Romario Shepherd’s batting style. 😄 pic.twitter.com/cefl0Zb17z
— Sonu (@Cricket_live247) April 2, 2026
