సింగ‌ర్ సునీత‌- రామ్ ల పెళ్లి తేది..?

సింగ‌ర్ సునీత‌- రామ్ ల పెళ్లి తేది..?
ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత కొద్దిరోజుల క్రితం డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్ప‌టి నుండి మీడియాలో ఆమె పెళ్లి తేదిపై ప‌లు వార్తలు వ‌చ్చాయి. డిసెంబర్ 27న వారిద్దరూ పెళ్లి చేసుకో‌బోతున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే..  ఆ తేదీన సునీత, రామ్ ల పేర్లపై ముహుర్తం కుదరలేదని, జనవరి 9న వారి పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందువల్ల సినీ సెలబ్రిటీల కోసం సునీత శ‌నివారం ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇన్విటేష‌న్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.