ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగల కృష్ణారెడ్డి, లంకల దీపక్ రెడ్డికి సిట్ నోటీసులు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగల కృష్ణారెడ్డి, లంకల దీపక్ రెడ్డికి సిట్ నోటీసులు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డికి షాక్ ఇచ్చింది సిట్. ఈ కేసుకి సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది సిట్. ఈమేరకు దీపక్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు సిట్ అధికారులు. విచారణకు ఎప్పుడొస్తారో చెప్పాలంటూ ఫోన్ కాల్ అడిగారు అధికారులు. ప్రశిక్షణ తరగతులు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు అడిగి చెబుతానని బదులిచ్చారు దీపక్ రెడ్డి

రెండు మూడు రోజుల్లో దీపక్ రెడ్డి సిట్ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి దగ్గర పని చేశారు దీపక్ రెడ్డి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేశారు లంకల దీపక్ రెడ్డి.

రేపు ( జూన్ 4 ) ఉదయం 11 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలంటూ తీగల కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్‌.  2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నారు తీగల కృష్ణారెడ్డి.