- మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో ప్రమాదం
జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని బార్గి డ్యామ్‌లో గురువారం క్రూయిజ్ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. మధ్యప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బోటులో మొత్తం 29 మంది పర్యాటకులు ఉన్నారు. ఖమరియా ద్వీపం సమీపంలోకి బోటు వచ్చినప్పుడు సడెన్‌గా తుపాన్ ఏర్పడింది.
ఈ ధాటికి బోటు నీట మునిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీళ్లలో పడిన వారిలో 15 మంది పర్యాటకులను రెస్క్యూ టీమ్‌లు కాపాడాయని, గల్లంత్తైన వారికోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

