ఇది నిజంగా సంచలనమే : పరువు హత్యకు గురైన దళిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కెవిన్ అత్త ఎమ్మెల్యేగా గెలిచారు..

ఇది నిజంగా సంచలనమే : పరువు హత్యకు గురైన దళిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కెవిన్ అత్త ఎమ్మెల్యేగా గెలిచారు..

తమిళనాడు జనం ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి పాలన కోరుకుంటున్నారు.. ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు అనేది ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను చూస్తే స్పష్టం అవుతుంది. 
తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కెవిన్ పరువు హత్య కేసు తెలిసే ఉంటుంది కదా.. 
2025, జూలై నెలలో తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగింది ఈ పరువు హత్య. 
దళిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కెవిన్ అత్త ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. 
ఈరోడ్ లోని భవానీసాగర్ నియోజకవర్గం నుంచి కెవిన్ అత్తయ్య విపి తమిళసెల్వి.. విజయ్ పార్టీ టీవీకే తరపున బరిలోకి దిగారు.
ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు.. అన్నా డీఎంకే నుంచి ఎ.బన్నారి నిలబడ్డారు. ఆయన రాజకీయ ఉద్దండుడు.
అలాంటి వ్యక్తిని.. తమిళసెల్వి 4 వేల 569 ఓట్లతో ఓడించారు. ఈమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. ఓ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పని చేశారు. ప్రస్తుతం బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నారు. 
తన మేనల్లుడు కెవిన్ పరువు హత్య తర్వాత చేసిన పోరాటం జనానికి బాగా దగ్గర చేసింది. 
ఈ క్రమంలోనే విజయ్ ఆమెను పిలిచి మరీ సీటు ఇచ్చారు. 
అన్నాడీఎంకే అభ్యర్థి బలంగా ఉండటంతో.. ఏం గెలుస్తుందిలే అనుకున్నారు అంతా. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత అద్భుతమైన విజయం ఆమె సొంతం అయ్యింది. ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. 
జస్ట్ 10 నెలల క్రితం ఆమె ఓ సాధారణ మహిళ.. ఇప్పుడు ఎమ్మెల్యే.

ఇంతకీ దళిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కెవిన్ ఎవరు అంటారా. చెన్నై సిటీలో అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తన తాతయ్యకు ఆరోగ్యం బాగోలేదని.. అతన్ని చూడటానికి తిరునెల్వేలి వెళ్లాడు. అప్పటికే కెవిన్ కు సుభాషిణి అనే డాక్టర్ తో ప్రేమలో ఉన్నాడు. సుభాషిణి ఫ్యామిలీకి కెవిన్ నచ్చలేదు. కారణం కులం. కెవిన్ దళితుడు. ఈ కారణంగానే..  తిరునెల్వెలి వచ్చిన కెవిన్ ను.. సుభాషిణి సోదరుడు మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొడవలితో నరికి చంపాడు. 
ఇక్కడ విశేషం ఏంటంటే.. సుభాషిణి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసులు. కేసును కేవలం హత్య కోణంలో ముగించాలనే ప్రయత్నం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. కెవిన్ అంత్యక్రియలు చేయకుండా 5 రోజులు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత సుభాషిణి తండ్రి అరెస్ట్.. తల్లి సస్పెన్షన్.. కేసు సీబీసీఐడీకి అప్పగించటం.. దీనిపై సినిమాలు వాళ్లు మాట్లాడటం.. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగటం.. తమిళనాడులోనే కుల పంచాయితీలు, కుల గొడవలు జరిగాయి. 

అంత పెద్ద ఇష్యూ జరిగింది కెవిన్ హత్య కేసు తర్వాత. ఆ కెవిన్ అత్తయ్యనే తమిళసెల్వి.. ఇప్పుడు భవానీసాగర్ ఎమ్మెల్యే.. విజయ్ పార్టీ టీవీకే నుంచి గెలిచారు..