స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా?

స్వెటర్ వేసుకుని నిద్రపోతున్నారా?

రాత్రుళ్లు చలి తీవ్రత తట్టుకోలేక చాలామంది ఉన్ని స్వెటర్లు వేసుకొని నిద్రపోతుంటారు. అయితే, ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే..

  • నిద్రపోయే ముందు ఉన్ని స్వెటర్లు వేసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను కోల్పోతాము. దానివల్ల చర్మం పొడిబారిపోతుంది. అది స్కి్న్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. పిల్లలు డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది.
  • స్వెటర్ అంటుకున్న  దుమ్ము వల్ల ఎలర్జీ, దగ్గు రావచ్చు. ఇది వరకే శరీరానికి ఎలర్జీ ఉన్నట్లయితే స్వెటర్లకు దూరంగా ఉండటం మంచిది. 
  • వెచ్చదనం కోసం స్వెటర్లు, బ్లాంకెట్లు కప్పుకున్నట్లయితే శరీరానికి గాలి అందక చెమటలు పడతాయి. దాంతో రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 
  • స్వెటర్ల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఆస్తమాకు దారి తీస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు వీటిని ధరించకపోవడం మంచిది.
  • సాక్స్, గ్లౌజ్, స్వెటర్లు వేసుకోవడం వల్ల ఎక్కువ చెమట పడుతుంది. దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.