ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో నాకు తెల్వదు :   సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  వీ6 స్పెషల్ షోలో పాల్గొన్నారు రేవంత్.  .  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB)లో సర్వర్లు ధ్వంసమయ్యయనే కేసు నమోదైందని..  ఆ కేసు విచారణలోనే  ఫోన్ ట్యాపింగ్  బయటకు వచ్చిందన్నారు సీఎం రేవంత్.  ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడికెళ్లి ఆగుతుందో తనకు తేలియదన్నారు.  నివేదిక వచ్చిన తరువాత ప్రజలకు పూర్తి వివరాలు  చెప్తామన్నారు సీఎం.  ఈ కేసులో సూత్రదారులు, పాత్రదారులెవరున్నా చర్యలు తీసుకుంటానని చెప్పారు.  

కాగా ఈ కేసులో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.  ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు.