కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు..అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు

కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు..అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు

ఇటీవల కాలంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయంటూ చాలామంది బాధపడుతూ ఆస్పత్రులకు పరుగులు పెడుతుంటారు. అసలు కిడ్నీలు రాళ్లు ఎలా వస్తాయి.. వాటికి గల కారణాలేమిటి.. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని విషయాలు మనం తెలుసుకుందాం.. 

కిడ్నీలో రాళ్లు రావడానికి అనేక కారణాలుంటాయి.. ఎక్కువ శాతం మందికి శరీరంలోని మృదువైన కణజాలంలో కాల్షియం అధికంగా పేరుకుపోవడం వల్ల కాల్షియం రాళ్లు(Calcium deposit) గా ఏర్పడతాయి. మోకాళ్ల మధ్య కణజాలంలో కాల్షియం  వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. భుజం, చేతి మధ్య కణజాలంలో కాల్షియం నిల్వల వల్ల (Calcific Tendonosis ) నొప్పులు వస్తాయి. మెడ కండరాలల్లో , ఛాతి కణజాలంలో కూడా కాల్షియం పేరుకుపోతే నొప్పులు ఏర్పడతాయి. ఇక ముఖ్యమైన పార్ట్.. మూత్రపిండాల్లో కాల్షియం అధికాంగా పేరుకుపోతే.. కాల్షియం రాళ్లుగా ఏర్పడి తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది. 

కిడ్నీ రాళ్లు రాకుండా సహజంగా నివరించాలంటే.. 

పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటిపండ్లు, ఆకు కూరల్ల మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కాల్షియం బయటికి పంపబడుతుంది. 

నేల ఉసిరి ఆకు పొడి రోజుకు 4 గ్రాముల చొప్పున నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీల్లో అన్ని మృదు కణజాలంలో పేరుకొని ఉన్న కాల్షియం శరీరం నుండి బయటికి పంపబడుతుందట.

ప్రతి రోజు ఉదయం Apple Cider vineggar  ను ఒక టేబుల్ స్పూన్ చొప్పన 200 మిలీటర్ల నీటిలో కలుపుకొని తాగితే మంచింది. ఆపిల్ లో ఉండే మాలిక్ యాసిడ్ ఈ పేరుకొని ఉన్న కాల్షియంను శరీరం నుంచి బయటికిపంపిస్తుంది. ఇది అత్యంత ప్రభావం చూపే రెమిడీ. ఆపిల్ సైడర్ వెనిగర్ ను యాపిల్ జ్యూస్ లో ఈస్ట్, బ్యాక్టీరి యాను జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. పుల్లని రుచి, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను శక్తికోసం కూడా ఉపయోగిస్తారు .

పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ మంచినీరు రోజుకు 3-4 లీటర్లు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు సమస్యలు సహజంగా నివారంచొచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతు న్నారు. 

పరిష్కారం: 

రోగి శారీరక,మానిసక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని జెనెటిక్ కాన్ స్టిట్యూషన్ చికిత్స ద్వారా కిడ్నీ స్టోన్స్ కు చికిత్స చేయవచ్చు.. కిడ్నీలోని లవణాల సమతుల్యత కాపాడి, వాటి పనితీరును మెరుగు పర్చడం ద్వారా మళ్లీ మళ్లీ రాళ్లు రాకుండా చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.