GT vs RCB: జాక్స్ మెరుపు సెంచరీ.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన బెంగళూరు

GT vs RCB: జాక్స్ మెరుపు సెంచరీ.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన బెంగళూరు

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పుంజుకుంటుంది. మొదటి అర్ధ భాగంలో దారుణంగా విఫలమైన ఆ జట్టు సెకండ్ హాఫ్ లో అదరగొడుతుంది. వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్‌‌‌‌సీబీ 16 ఓవర్లలో 206 పరుగులు చేసి గెలిచింది. 

201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు ఎక్కడా తడబడలేదు. మొదట ఓపెనర్లు పవర్ ప్లే లో సూపర్ స్టార్ట్ ఇచ్చారు. 12 బంతుల్లో 2 సిక్సులు, ఒక ఫోర్ తో డుప్లెసిస్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, విల్ జాక్స్ గుజరాత్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. మొదట్లో పరుగులు చేయడానికి తడబడినా ఆ తర్వాత విజృంభించారు. భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశారు. 74 బంతుల్లోనే వీరిద్దరూ అజేయంగా 166 పరుగులు జోడించడం విశేషం. 15, 16 ఓవర్లలో జాక్స్ విశ్వరూపం చూపించడంతో ఆర్సీబీ ఏకంగా 58 పరుగులు రాబట్టుకుంది. 

ఈ క్రమంలో జాక్స్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో కోహ్లీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ సాయి సుదర్శన్( 49 బంతుల్లో 84, 8 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరాటానికి తోడు షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 58) మెరుపులతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు భారీ స్కోర్ చేసింది.