CSK vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

CSK vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. దీంతో ఈ మ్యాచ్ లో ఇరు జట్లు గెలవాలని గట్టి ధీమాతో ఉన్నాయి. ఇప్పటివరకు చెన్నై ఆడిన 8 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించింది. మరో వైపు సన్ రైజర్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 గెలిచింది.          

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్ ), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్