మీకు స్లోఫీ తెలుసా?

మీకు స్లోఫీ తెలుసా?

మీకు స్లోఫీ తెలుసా..? సోఫీ తెలుసు.. కాఫీ తెలుసు.. ఈ స్లోఫీ ఏంటి? అని అంటారా? సెల్ఫీ కూడా తెలిసే ఉంటుంది కదా! ఇగో ఆ సెల్ఫీ లాంటిదే ఈ స్లోఫీ. అంటే స్లో మోషన్​ సెల్ఫీ అన్నమాట. మొన్నామధ్య యాపిల్​ కొత్త ఐఫోన్లను తీసుకొచ్చింది కదా. అదే, ఐఫోన్​ 11 సిరీస్​ ఫోన్లండి. ఆ ఫోన్లలోనే ఈ సరికొత్త స్లోఫీని తీసుకొచ్చింది యాపిల్​ కంపెనీ. సెప్టెంబర్​ 10న గ్రాండ్​గా జరిగిన కార్యక్రమంలో ఈ ‘స్లోఫీ’ పదాన్ని, ఫీచర్​ను ప్రముఖంగా చూపించింది కంపెనీ. అయితే, నెటిజన్లు మాత్రం ఆ పదాన్ని తీసుకోలేకపోతున్నారు. 2019లో చెత్త పదాల్లో ఇదొకటని సెటైర్లు పేలుస్తున్నారు. ఫీచర్​ను పక్కనబెట్టేసి ఇదేం పదంరా బాబూ అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ప్లీజ్​ బాబూ, దాన్ని తీసేయండి అంటూ సూచిస్తున్నారు.