తెలంగాణ కిచెన్ : సమ్మర్ కదా ఇంట్లోనే సూపర్​ స్మూతీ

తెలంగాణ కిచెన్ : సమ్మర్ కదా ఇంట్లోనే సూపర్​ స్మూతీ

ఎండాకాలంలో ఎక్కువ చల్లగా, మెత్తగా కడుపులోకి వెళ్లేవి అయితే బాగుండు అనిపిస్తుంది. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా ఇలాంటి స్మూతీలతో రోజు మొదలుపెడితే సమ్మర్​ చిటపటలకు కొంచెం చెక్​ పెట్టొచ్చు. సూపర్​ లెవల్​లో పోషకాలు నింపుకున్న వీటి తయారీ ఈజీ. ఒక ​గ్లాస్​ స్మూతీ తాగితే కొన్ని గంటలు ఆకలి బాధ ఉండదు.  రకరకాల నట్స్​, సీడ్స్,​ ఫ్రూట్స్​తో తయారుచేసే వీటిని బ్రేక్​ఫాస్ట్​లానే కాకుండా సాయంత్రాలు శ్నాక్​లా కూడా  తాగేయొచ్చు. వర్కవుట్​ చేశాక మీల్​లా కూడా ఉపయోగపడతాయి.

స్ట్రాబెర్రీ

కావలసినవి : 

స్ట్రాబెర్రీ (ఫ్రోజెన్​ ) - అర కప్పు

అరటిపండు (ఫ్రోజెన్​ ) - ఒకటి

పాలు - ఒక కప్పు

పెరుగు -పావు కప్పు

తేనె - ఒక టేబుల్ స్పూన్​

బాదం గింజలు - ఎనిమిది

పుచ్చ గింజలు ​ - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : బ్లెండర్​ జార్​లో మొదట పాలు పోయాలి. పాలు ఇష్టపడని వాళ్లు నీళ్లు వాడొచ్చు. అయితే పాలతో తయారుచేస్తే వచ్చిన క్రీమీ టెక్చర్​ నీళ్లతో రాదు. తరువాత పెరుగు వేసి మిగతా పదార్థాలు వేయాలి. జార్​కి మూత పెట్టి బాగా బ్లెండ్​ చేస్తే  చిక్కటి, క్రీమీ స్ట్రాబెర్రీ స్మూతీ గాజు గ్లాస్​లో వంపుకుని తాగేయడమే.

ద్రాక్ష

కావలసినవి :

నల్ల ద్రాక్షలు (ఫ్రోజెన్​ )  - అర కప్పు

ఆకుపచ్చ ద్రాక్షలు (ఫ్రోజెన్​ )  - అర కప్పు

పైనాపిల్(ఫ్రోజెన్​ ) ​ - అర కప్పు

బీట్​రూట్​ -పావు కప్పు

వాల్​నట్స్​ - రెండు టేబుల్​ స్పూన్​

నీళ్లు - ఒక కప్పు

తయారీ : బ్లెండర్​ జార్​లో నీళ్లు లేదా మీకు నచ్చిన జ్యూస్​ పోయొచ్చు. తరువాత కళ్లకు, చర్మానికి చాలా మేలు చేసే నల్ల ద్రాక్ష వేయాలి. బ్లెండర్​ జార్​కి మూత పెట్టి చిక్కగా అయ్యేవరకు బ్లెండ్​ చేయాలి. అలా స్మూతీ తయారవడం ఆలస్యం తాగడమే తరువాయి.

అరటి, ఓట్స్​..

కావాల్సినవి : 

అరటిపండు (ఫ్రోజెన్​ )- ఒకటి

ఇన్​స్టంట్​ లేదా రోల్డ్​ ఓట్స్​, పెరుగు - ఒక్కోటి పావు కప్పు

పాలు - ఒక కప్పు

పీనట్​ బటర్ , తేనె - ఒక్కో టేబుల్​ స్పూన్

తయారీ : బ్లెండర్​ జార్​లో పాలు, పెరుగు ఒకదాని తరువాత ఒకటి వేయాలి. ఆ తరువాత ఓట్స్​, అరటిపండు వరసగా వేస్తూ చివర్లో పీనట్​ బటర్​ వేయాలి. పీనట్​ బటర్​ చివర్లో వేయడం వల్ల స్మూతీ​ టెక్చర్​ బాగుంటుంది. అంతేకాదు నట్స్​, అవకాడోల్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. స్మూతీకి కావాల్సిన అన్ని పదార్థాలను ​ బ్లెండర్​ జార్​లో వేశా​క మూత పెట్టి బ్లెండ్​ చేస్తే స్మూతీ రెడీ. 

పైనాపిల్​, బొప్పాయి

కావలసినవి :

ఆరెంజ్​ జ్యూస్​ - ఒక కప్పు

బొప్పాయి (ఫ్రోజెన్​ ),  పైనాపిల్​ (ఫ్రోజెన్​ ) ముక్కలు - ఒక్కోటి అర కప్పు

తేనె - ఒక టీస్పూన్​

చియా లేదా సబ్జా గింజలు - ఒక టేబుల్​ స్పూన్​

పసుపు - పావు టీస్పూన్​

తయారీ : బ్లెండర్​ జార్​లో  తాజాగా తయారుచేసుకున్న ఆరెంజ్ జ్యూస్​ పోయాలి. పొద్దుపొద్దున్నే విటమిన్​ సి పుష్కలంగా అందుతుంది దీనివల్ల. తరువాత​ బొప్పాయి ముక్కలు వేయాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బ్లెండర్​ మూతపెట్టి అన్నీ కలిసిపోయేలా  బ్లెండ్​ చేయాలి. చిక్కటి పవర్​ ప్యాక్డ్​ స్మూతీ తయారు చేసిన వెంటనే తాగితే ఆ రోజు ఎనర్జిటిక్​గా మొదలైనట్టే.