మకాయ్: ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(64 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో114 నాటౌట్) విమెన్స్ బిగ్‌బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)లో రికార్డు సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో సెంచరీ కొట్టిన తొలి ఇండియన్‌గా నిలిచింది. దాంతో పాటు హయ్యెస్ట్ ఇండివిడ్యువల్ స్కోరు రికార్డును సమం చేసింది. కానీ ఇండియా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో లాస్ట్ బాల్‌కు విన్నింగ్ సిక్స్ కొట్టలేక తన టీమ్ సిడ్నీ థండర్‌ను గెలిపించలేకపోయింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ 4 రన్స్ తేడాతో మెల్‌బోర్న్ రెనెగెడ్స్ విమెన్ చేతిలో ఓటమిపాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ 20 ఓవర్లలో 175/4 స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బాల్స్‌లో 81 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ చేసింది. మరో ఇండియన్ జెమీమా రోడ్రిగ్స్(2) నిరాశపర్చింది. అనంతరం భారీ చేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన సిడ్నీ 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 171 రన్స్ మాత్రమే చేసి ఓడింది. స్మృతికి తోడుగా తహిలియా విల్సన్(38 నాటౌట్) చివరి దాకా పోరాడింది. తన ఇన్నింగ్స్‌తో మంధాన ఈ టోర్నీలో హయ్యెస్ట్ ఇండివిడ్యువల్ స్కోరర్‌గా ఉన్న ఆసీస్ బ్యాటర్ యాష్లే గార్డ్‌నర్ (114) సరసన నిలిచింది.

