బంగారాన్ని.. స్క్రూలు, రాడ్లుగా తయారుచేసి స్మగ్లింగ్

బంగారాన్ని.. స్క్రూలు, రాడ్లుగా తయారుచేసి స్మగ్లింగ్

జనాలకు ఇంతటి క్రియుటివిటీ ఎక్కడినుంచి వస్తుందో కానీ.. రోజుకొక స్టైల్లో వేదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇవాళ (ఏప్రిల్ 9) దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గరనుంచి ఏకంగా 454 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా భారత్ కు తరలించిన బంగారాన్ని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిపోర్ట్ లో పట్టుకున్నారు. 

ఇందులో ట్విస్ట్ ఏంటంటే... బంగారాన్ని 64 స్క్రూలు, 16 రాడ్ లుగా తయారుచేసి వాటికి సిల్వర్ కలర్ వేశాడు. ఆ స్క్రూలను ఓ సూట్ కేసుకు అమర్చాడు. ఈ బంగారం విలువ రూ. 21 లక్షలు ఉంటుందని కస్టమ్స్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఏఐ 952 ఫ్లైట్లో ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి దగ్గరనుంచి కస్టమ్స్ ఆఫీసర్లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.