ఓయో, ఫ్లిప్ కార్ట్ తో సాఫ్ట్ బ్యాంక్ కు భారీ లాభాలు

ఓయో, ఫ్లిప్ కార్ట్ తో సాఫ్ట్ బ్యాంక్ కు భారీ లాభాలు

రెండేళ్ల క్రితం ఓలా, స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి 1.4 బిలియన్ డాలర్ల నష్టాలు పొందిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… ఇప్పుడు ఓయో, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో దూసుకుపోతోంది. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్, ఓయోలో పెట్టిన మొత్తం పెట్టుబడులతో రూ.18,881 కోట్ల(2.7 బిలియన్ డాలర్ల) లాభాలను పొందినట్టు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ ప్రకటించింది. జపనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ ఇండియాలోని పలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పెట్టుబడులు పెడుతూ… ఆదాయాలను ఆర్జిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తంగా ఇండియన్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రూ.69,932 కోట్ల(10 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఆపరేటింగ్ మార్జిన్లలో యేటికి 80 శాతం వృద్ధిని నమోదు చేసింది. రైడ్ హైరింగ్ కంపెనీ ఉబర్, ఇండియన్ హాస్పిటాలిటీ కంపెనీ ఓయో, ఇతర పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీల పెట్టుబడుల నుంచి రూ.87,415 కోట్ల(12.5 బిలియన్ డాలర్ల) లాభాలను పొందినట్టు మసయోషి సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ పేర్కొంది. వీటిలో ఓయో, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు చెల్లించినవే 2.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఇండియన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ సొంతం చేసుకోవడంతో, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ కంపెనీలో ఉన్న షేర్లను అమ్మేసింది. దీంతో 1.3 బిలియన్ డాలర్ల లాభాలను పొందింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఓయో వాల్యుయేషన్ 1.4 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇండియాలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ విజన్ ఫండ్…

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ విజన్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 100 బిలియన్ డాలర్ల కార్పస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2017లో ఏర్పాటు చేశారు. ఈ విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, అబుదాబి నుంచి సేకరించినవే. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ విజన్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐపీఓకు తీసుకొచ్చేందుకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ ఈ నెల ప్రారంభంలో చర్చలు కూడా జరిపింది. ఇండియాలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఓలా, ఓయో, హైక్, పేటీఎం, ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రై, గ్రోఫర్స్, ఢిల్లీవెర్రి, ఆటోమేషన్ ఎనీవేర్, పేటీఎం మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. గత నెలలో ఓయో, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హోటల్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ సీఈవో చెప్పారు. లోకల్ కంపెనీలు గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెళ్లేలా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చేలా తాము తీర్చిదిద్దనున్నామని పేర్కొన్నారు.