డ్రగ్ రాకెట్ లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ అరెస్ట్

డ్రగ్ రాకెట్ లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ అరెస్ట్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ సప్లైలో మోస్ట్ వాంటెడ్ భరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. భరత్ అత్యవసర మెడిసిన్ పేరుతో వివిధ నగరాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకొచ్చే లారీల ద్వారా గోవా, ముంభై, చెన్నై, బెంగుళూరు మొదలైన పట్టణాల నుంచి డ్రగ్స్ నగరానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ డ్రగ్స్ ను నగరంలోని పలువురు సాఫ్ట్‌వేర్  ఇంజనీర్లు, వ్యాపారవేత్తలకు సరఫరా చేసినట్లు భరత్ ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి భరత్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్ స్మగ్లర్ల నుంచి 25 గ్రాముల కొకైన్, 105 గ్రాముల ఎండిఎమ్ఎ, ఎల్ఎస్డి నాలుగు బ్లాట్లు, 25 గ్రాముల హాషీష్ ఆయిల్ మరియు 250 గ్రాముల గంజాతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఈ దందాలో సభ్యులైన మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

For More News..

‘వందేభారత్’లో భాగంగా ఇండియాకు చేరిన మరో ఫ్లైట్

వీడియో: 40 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకున్న 93 ఏళ్ల మహిళ

కర్ణాటక ప్రభుత్వానికి రూ. 10 లక్షల ఫైన్