- ప్రమాదవశాత్తు పడ్డాడా? ఆత్మహత్యా?
కూకట్పల్లి, వెలుగు: బిల్డింగ్ పైనుంచి పడి ఓ సాఫ్ట్వేర్ఇంజినీర్మృతిచెందాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొత్తచిలుమూరుకు చెందిన పూల భానువర్ధన్(27) సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్. తన తమ్ముడు విష్ణువర్ధన్తో కలిసి గాజులరామారంలో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి హైదర్‌నగర్‌లోని ఫ్రెండ్స్ రూమ్‌కు వెళ్లాడు.
అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ అపార్ట్మెంట్పెంట్హౌస్లో మద్యం తాగారు. శనివారం ఉదయం 5 గంటలకు ఫ్రెండ్స్నిద్రించగా.. భానువర్ధన్ మాత్రం ఉదయం 7 గంటల వరకు కూడా మద్యం తాగుతూనే ఉన్నాడు. కాసేపటికే బిల్డింగ్‌పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కింద పడ్డాడా లేక సూసైడ్చేసుకున్నాడా, మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
