సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేతులు, నోరు కట్టేసి..

 సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేతులు, నోరు కట్టేసి..

హైదరాబాద్ లో ఓ సాప్ట్ వేవ్ ఇంజినీర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి నోట్లో  గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి వెళ్లిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 15న సాప్ట్ వేర్ ఇంజనీర్ శ్రీహర్ష, స్నేహితుడు సాయిరాంలను మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే అదే రోజు పోలీస్ స్టేషన్ లో శ్రీహర్ష పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిన్న అర్ధరాత్రి వచ్చి శ్రీహర్షని చితకబాదినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, ATM కార్డుతో పాటు 3వేల 5వందల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.