కామన్ మేన్‌‌‌‌ నుంచి చిన్న సెలెబ్రిటీ స్టేటస్‌‌‌‌కు రావడం కొత్తగా ఉంది

కామన్ మేన్‌‌‌‌ నుంచి చిన్న సెలెబ్రిటీ స్టేటస్‌‌‌‌కు రావడం కొత్తగా ఉంది

‘బిగ్‌‌‌‌బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా ఎ.ఆర్.అభి రూపొందించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్. హరిత గోగినేని నిర్మించారు.  ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ ‘కామన్ మేన్‌‌‌‌ నుంచి చిన్న సెలెబ్రిటీ స్టేటస్‌‌‌‌కు రావడం కొత్తగా ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నా. ఆ విషయంలో నేను లక్కీ. వాటిలో ముందుగా వస్తోన్న సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. ఇదొక క్యూట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.

 ప్రతి ఒక్కరికీ లైఫ్‌‌‌‌లో లక్‌‌‌‌ను నమ్ముకున్న సందర్భాలుంటాయి. ఇదికూడా అలాంటి కథే. కంప్లీట్ క్లీన్ కామెడీ.  చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. 28 రోజులు, రెండు షెడ్యూల్స్‌‌‌‌లో షూటింగ్ పూర్తి చేశాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీమ్ అంతా బెస్ట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ హరిత గారు సినిమాపై నమ్మకంతో  సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్‌‌‌‌కట్ బాలరాజుతో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నా’ అని చెప్పాడు.