V6 News

సోలార్ మార్కెట్‌‌ దూకుడు.. 2026 నాటికి రెండో అతిపెద్ద మార్కెట్‌‌

సోలార్ మార్కెట్‌‌ దూకుడు.. 2026 నాటికి రెండో  అతిపెద్ద మార్కెట్‌‌

న్యూఢిల్లీ: భారతదేశం 2026 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్‌‌గా అవతరించనుందని నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ) వెల్లడించింది.  కేవలం 14 నెలల్లోనే అదనంగా 50 గిగావాట్ల సౌర శక్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో మొత్తం సోలార్ కెపాసిటీ 150 గిగావాట్లు దాటింది.

 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్​ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సోలార్ ఎనర్జీ పాత్ర కీలకం కానుంది. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ వంటి ప్రభుత్వ పథకాలు సౌర విద్యుత్ వాడకాన్ని పెంచుతున్నాయి. 

అమెరికా, యూరప్​ వంటి ప్రాంతాలను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానంలో నిలవనుంది. పరిశ్రమల్లో సోలార్ వాడకం కూడా ఊపందుకుంది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, స్వదేశీ తయారీకి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల సౌర ఫలకాల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది.