ఆన్ లైన్ క్లాసుల్లో పర్ఫెక్ట్ టీచింగ్ కష్టమేనట..

ఆన్ లైన్ క్లాసుల్లో పర్ఫెక్ట్ టీచింగ్ కష్టమేనట..

నేను హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. ఆన్ లైన్ క్లాసుల్లో పర్ఫెక్ట్ టీచింగ్ కష్టమే. స్కూల్లో అయితే పిల్లలతో డైరక్ట్ ​ ఇంటరాక్షన్ ఉంటుంది. కథలు చెప్పో, వాళ్ల చేతే రోల్ ప్లే చేయించో, నాలుగు జోకులు చెప్పో… వాళ్ల ధ్యాసను పాఠం మీదకి మళ్లించొచ్చు. రన్నింగ్ నోట్స్ రాయించొచ్చు. పిల్లలకి అర్థమైందో లేదో తెల్సుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేయొచ్చు. ఆన్ లైన్ క్లాసుల్లో ఇవన్నీ చేయలేం. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్లో పాఠం చెబుతున్నాను. బోర్డు వాడితే నేను రాసేది పిల్లలకు క్లియర్ గా కనిపించదు. ఏదైనా డయాగ్రమ్ చూపించాలన్నా, స్క్రీన్ మీదే. దాన్ని చూపించేటప్పుడు నేను కనపడను. నేను కనిపించేటప్పుడు అది కనపడదు. రేడియో వింటున్నట్లు ఉంటుంది.

ముఖ్యంగా పిల్లలతో ఐ కాంటాక్ట్​ మిస్ అవుతుంది. ఇప్పుడు ఒక్కో క్లాస్ కు నలభై నిమిషాల టైం మాత్రమే ఇస్తున్నారు. మొదటి పది నిమిషాలు పిల్లలు లాగిన్ అయి, కనెక్ట్ అవడానికే సరిపోతుంది. ఇంటర్నెట్ సరిగా లేకుంటే ఆడియో, వీడియోలో క్లారిటీ ఉండదు. ఎప్పటికప్పుడు డౌట్స్​ కూడా క్లియర్ చేయడం కుదరదు. క్లాసులో ఉన్నట్టు కో–ఆర్డినేషన్ ఉండటం అస్సలు కుదరదు. చాలా మంది పిల్లలు కళ్ళు లాగుతున్నాయని, తలనొప్పిగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. క్లాసులో అందరూ ఒకేరకమైన పిల్లలుండరు. ఒకేలా నేర్చుకోరు. క్లాసు తీరును, పిల్లల రెస్పాన్స్​ని బేస్  చేసుకుని ముందుకు సాగుతుంది పాఠం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా కష్టంగానే ఉంది.    – భరణి చిత్రలేఖ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి