నేడు ఎస్కే జోషికి సెండాఫ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ సోమేశ్ కుమార్ (1989 బ్యాచ్) నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై మంగళ వారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమేశ్ కు మూడేళ్లకు పైగా పదవీ కాలం ఉండడంతో సీఎం ఆయన వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక ప్రస్తుత సీఎస్ ఎస్కే జోషి మంగళవారం రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్కే భవన్లో ఆయనకు సెండాఫ్ ఇవ్వనున్నారు.

