చదువుకోమని చెప్పినందుకు తండ్రిని చంపిండు

V6 Velugu Posted on Apr 22, 2021


మిర్యాలగూడ, వెలుగు: చదువుకోమని మందలించిన తండ్రిని కన్న కొడుకే చంపేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్​లో జరిగింది. స్థానికులు, వేములపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన బంటు ఎల్లయ్య(45), లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు నాగేందర్(19), కూతురు భవాని. నాగేందర్ ​సూర్యాపేటలో ఇంటర్​ ​సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. బుధవారం ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. నాగేందర్​ఆవేశంలో కత్తెరతో తండ్రి గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. 

Tagged son, murder, study, father, Nalgonda pamulapahad

Latest Videos

Subscribe Now

More News