కోల్‌కతా: హిస్టారికల్ డేనైట్‌టెస్ట్ సక్సెస్‌కావడంతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల్లో పింక్ బాల్‌టెస్ట్‌జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చాడు. ‘ప్రస్తుతం నేను చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉన్నా. టెస్ట్‌క్రికెట్‌కోసం మేం డేనైట్‌మ్యాచ్‌ఆడాలనుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్‌కూడా. టెస్ట్‌క్రికెట్‌ను ప్రజలు వదిలేయకూడదు. ఈ టెస్ట్‌కు ముందు మేం చాలా ప్రమోషన్స్‌నిర్వహించాం. మ్యాచ్‌తొందరగా ముగుస్తుందని తెలిసినా.. మూడో రోజు టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. 2001లో ఇండియా–ఆసీస్‌టెస్ట్‌కు లక్ష మంది హాజరయ్యారు. అలాటింది కోహ్లీ, రోహిత్, ఇషాంత్‌లాంటి చాంపియన్లు ఖాళీ స్టాండ్స్‌ముందు ఆడితే ఎలా? స్టేడియం ఫుల్‌అయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని దాదా వెల్లడించాడు. డేనైట్ టెస్ట్‌ఎక్స్‌పీరియెన్స్‌గురించి తొందరలోనే కోహ్లీతో మాట్లాడుతానన్నాడు.


