లక్నో: కరోనా పాజిటివ్‌గా తేలిన బాలీవుడ్ సింగర్కనికా కపూర్ ఉన్న హోటల్లోనే ఇండియా టూర్‌కు వచ్చిన సౌతాఫ్రికా టీమ్‌కూడా బస చేసిందన్న విషయం సంచలనం రేపుతోంది. మూడు వన్డేల సిరీస్ కోసం ప్రోటిస్ టీమ్ ఇటీవల ఇండియాకు వచ్చింది. అందులో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా.. రెండో వన్డే కోసం సౌతాఫ్రికా జట్టు లక్నో చేరుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ న్యూస్ చానల్ నిర్వహించిన వార్షిక కాన్క్లేవ్ మీటింగ్‌లో పాల్గొనడానికి కనికాఅదే హోటల్లో దిగింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఆ హోటల్లో ఉన్న కనికా.. అక్కడ భోజనం చేయడంతోపాటు పలువురు గెస్ట్‌లను కూడా కలిసిందని సమాచారం. దీంతో ఆ టైమ్‌లో ఆమె ఎవరెవరిని కలిసిందనే దానికి సంబంధించి.. హోటల్ సీసీటీవీ ఫుటేజీలను ఓ ఎక్స్ పర్ట్బృందం పరిశీలిస్తోంది.

