ఓటు వేసేందుకు 28 మందికి స్పెషల్ బోటు

ఓటు వేసేందుకు 28 మందికి స్పెషల్ బోటు

అద్దెకు తీసుకున్న ఈసీ

నోయిడా: ఓట్ల కోసం నోట్లు పంచే వారిని పట్టుకుంటున్న ఎన్నికల సంఘం అక్కడ ఓట్ల కోసం బోటు ఏర్పాటు చేసింది . ఎందుకంటే ఆ ఊరికి వెళ్లేందుకు దారి లేదు. దేశ రాజధాని న్యూఢిల్లీ పరిసరాల్లోని గౌతం బుద్దనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధి లోని ‘దలేపూర్’ గ్రామానికి  దారి లేదు.యమునా నది దాటితే తప్ప ఆ ఊరికి చేరుకోలేరు. నదిపై వంతెన లేదు. దీంతో ఓటర్లను 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించేందుకు ఎన్నికల సంఘం మోటారుబోటు ఏర్పాటు చేసింది . ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ప్రయివేట్ బోటును అద్దెకు తీసుకుంది . 250 కుటుంబా లున్న ఈ ఊరిలో 28మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ కార్డు మాత్రమే  కాదు గ్రామస్తుల్లో చాలా మంది కి ఆధార్ కార్డు , రేషన్ కార్డు , డ్రైనింగ్ లైసెన్స్ లాంటి పత్రాలు కూడా లేవు. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ , మంచినీటి సరఫరా లాంటి కనీస అవసరాలు కూడా అక్కడి వారికి లేవు. కనెక్టివిటీ బ్రిడ్జ్ నిర్మిస్తే తప్ప తమ బతుకులు మారవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.