మీకు టూరిజం హాబీనా? ఖాళీ టైం దొరికితే సరదాగా ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటారా? వీలు కుదిరినప్పుడల్లా ఒక్కో టూరిజం స్టాట్ కు వెళ్లొస్తుంటారా? అయితే మీ ప్రయాణం సుఖవంతంగా, సులభంగా సాగాలంటే ఎక్కువ అసరాలు తీర్చేలా తక్కువ లగేజ్ ఉండడం బెస్ట్ కదా? అందుకే ప్రస్తుతం మార్కెట్లో ట్రావెలింగ్కు ఉపయోగపడే సులభమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను మీ ముందుకు తెస్తున్నాం. వీటితో జర్నీ హ్యాపీగా, ఫ్లెక్సిబుల్ గా సాగిపోతుందని టూరిస్టుల మాట!
లెక్స్ వేరబుల్ చైర్
లెక్స్ వేరబుల్ చైర్
ఏదైనా కొత్త ప్రదేశానికి, ఊరికి వెళ్లినప్పుడు కూర్చోవడానికి సరైన వసతి దొరకదు. చైర్, బెం చీలు వంటివి అందుబాటులో ఉండవు. అలాంటి సందర్భాల్లో ‘లెక్స్’ సంస్థ రూపొందించిన వేరబుల్చైర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బయోనిక్ ఎక్సోస్కెలిటన్ చైర్ ను నడుముకు కట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బ్యాగ్‌లాగే దీన్నీ మోసుకెళ్లొచ్చు. అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుని కూర్చోవచ్చు. కేజీకి కాస్త ఎక్కు వ బరువుండే ఇది 120 కేజీల వరకు మోయగలదు.
ఫోన్ చార్జింగ్ వాటర్ బాటిల్
ఎక్కు వ ఉపయోగపడే తక్కువ లగేజ్‌ను ఎంచుకోవడం ట్రావెలింగ్‌లో చాలా ఇంపార్టెంట్ . ఫోన్ చార్జింగ్ వాటర్ బాటిల్అండ్ స్టాండ్ అలాంటి బెస్ట్ గ్యాడ్జెట్. దీన్ని పవర్ బ్యాంక్ కమ్ వాటర్ బాటిల్ కమ్ మొబైల్స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ బాటిల్ కిం ది భాగంలో 5000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, పక్కన మొబైల్స్టాండ్ఉంటుంది. దీని ద్వారా మొబైల్ చార్జ్ చేయొచ్చు.
ట్రావెల్ మగ్ కాఫీ మేకర్
ప్రయాణాల్లో ఎప్పుడుపడితే అప్పుడు నచ్చిన కాఫీ తాగాలనుకుంటే దొరకదు. ట్రావెల్ మగ్ ఎస్ప్రెస్సో కాఫీ మేకర్ వెంటుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా కాఫీ తాగొచ్చు. పెద్ద వాటర్ బాటిల్సైజులో ఉండే దీనితో కాఫీ తయారు చేసుకోవచ్చు. పాలు వేడి చేసుకోవచ్చు. కాఫీ గిం జలు మరిగించడం, నీళ్లు వేడి చేయడం దగ్గర్నుంచి పూర్తి కాఫీ తయారు చేసుకునే వీలుంది. మూడు కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు. ముందుగా వీటిలో పాలు, కాఫీ పొడి వంటివి వేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడు మేకర్ ను అటూఇటూ తిప్పితే చాలు. నిమిషాల్లోనే కాఫీ తయారవుతుంది. బ్యాటరీతో ఇది పని చేస్తుంది.
సెల్ఫ్ ఫిల్లింగ్ వాటర్ బాటిల్
గాలిలోంచే నీ ళ్లు తీసిచ్చే బాటిల్ ఇది. అటవీ ప్రాంతాలు, ఎకో టూరిజం ప్లేస్ లకు వెళ్లినప్పుడు కొన్ని సార్లు మంచి నీళ్లు దొరకడం ఇబ్బందిగా ఉండొచ్చు. ఫాంటస్ సంస్థ తయారు చేసిన సెల్ఫ్ఫిల్లింగ్వాటర్ బాటిల్ ఉంటే మంచి నీళ్లకు ఎలాంటి సమస్యా ఉండదు. ఇది గాలిలోని తేమను సేకరించి, నీ టిగా మారుస్తుంది. దీని కింది భాగంలో కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి. అవి కరిగి నీటికి మినరల్స్‌ను అందిస్తాయి.
స్మార్ట్ లగేజ్
ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్లకు మోటరైజ్డ్ స్మార్ట్ లగేజ్ ఉపయోగపడుతుంది. వీల్స్ ఉండే ఈ సూట్‌కేస్ లో 118 కేజీల వరకు లగేజ్ తీసుకెళ్లొచ్చు. గంటసేపు చార్జింగ్ చేస్తే దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా వీటిని తీసుకెళ్లొచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ చేసుకునేందుకు స్పెషల్ పోర్ట్స్ ఉంటాయి. నడవలేమనుకున్నప్పుడు వీటిపై కూర్చుని కూడా కొద్ది దూరం వెళ్లొచ్చు.
గీతా మొబైల్ క్యారియర్
షాప్‌కెళ్లి సరుకులు కొన్నా, ఊరెళ్లాలన్నా బ్యాగులు మోసుకెళ్లడం చాలా కష్టమైన పని. గీతా మొబైల్ క్యారియర్ ఉంటే దేన్నీ మోయనక్కర్లేదు. ఇది మీరెక్కడికి వెళ్తే అక్కడికి మీ వెం టే వస్తుంది. ఇరవై కేజీల వరకు లగేజ్ కెపాసిటీ ఉన్న ఈ క్యారియర్ గంటకు దాదాపు ముప్పై కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. ఇండోర్, ఔట్ డోర్ .. ఎక్కడైనా వాడుకోవచ్చు.

