హైదరాబాద్, వెలుగు: పాత కార్లను కొని అమ్మే ఆన్‌లైన్–టు–ఆఫ్‌లైన్ రిటైల్ కంపెనీ ‘‘స్పిన్నీ’’ బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనివల్ల తమ బ్రాండ్ యువతకు మరింత దగ్గరవుతుందని ప్రకటించింది. స్పిన్నీ ద్వారా చాలా సులభంగా కారును కొనొచ్చని, అమ్మొచ్చని కంపెనీ ఫౌండర్, సీఈఓ నీరజ్ సింగ్ అన్నారు. అత్యుత్తమ బ్రాండ్లలో స్పిన్నీ ఒకటని, కంపెనీ అన్ని విషయాల్లో పారదర్శకత పాటించడం ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని పొందుతున్నదని సింధు అన్నారు. లక్ష్యం చేరుకోవడంలో సింధు చూపిన పట్టుదల యువతకు ఎంతో ప్రేరణ అని పేర్కొన్నారు.

