న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు గతం కన్నా రూ.214.20 కోట్లు ఎక్కువ కేటాయించారు. 2018–19 సంవత్సరంలో స్పోర్ట్ స్ బడ్జెట్ రూ.2002.72 కోట్లు ఉండగా, 2019–20 సంవత్సరానికి ప్రకటించిన స్పోర్ట్ స్ బడ్జెట్ మొత్తం 2216.92 కోట్ల రూపాయలుగా ఉంది. స్పోర్ట్ స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి, నేషనల్ స్పోర్ట్ స్ డెవలప్‌మెంట్ ఫం డ్ (ఎన్‌ఎస్ డిఎఫ్ )లకు ఈ బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. సాయ్‌కు గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.395 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని 450 కోట్లకు పెంచారు. మొత్తంగా సాయ్‌కు రూ.55 కోట్లు అదనంగా కేటాయించారు. ఇక ఎన్‌ఎస్ డిఎఫ్ కు ఇంతకుముందున్న రెండు కోట్ల ఫండ్ ను ఏకంగా 70 కోట్లకు పెంచారు. దీంతో పాటు ప్లేయర్లకు ఇచ్చే ఇన్సెంటివ్ ఫండ్స్‌ను 63 కోట్ల నుంచి 89 కోట్లకు పెంచారు.
అయితే నేషనల్ స్పోర్ట్ స్ ఫెడరేషన్స్ (ఎన్‌ఎస్ ఎఫ్)లకు ఇచ్చే మొత్తంలో స్వల్పంగా కోత పడింది. ఇంతకు ముందు ఈ మొత్తం 245.13 కోట్లు ఉండగా తాజాగా ఈ మొత్తాన్ని 245 కోట్లకు తగ్గించారు. ఇక ప్లేయర్లకు ప్రోత్సాహకాలు, అవార్డుల మొత్తం కూడా అదనంగా 94.07 కోట్లకు పెరిగింది. ఇంతకు ముందు ఏడాది ఈ మొత్తం రూ316.93 కోట్లు కాగా, తాజా బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.411 కోట్లకు పెంచారు. ఖేలో ఇండియా నేషనల్ స్పోర్ట్ స్ డెవలప్‌మెంట్ ఫర్ స్పోర్ట్ స్ ఫండ్ కు కూడా అదనంగా రూ.50.31 కోట్లు కేటాయించారు. గతంలో ఈ ఫండ్ కు 550.69 కోట్ల
నిధులుండగా, ఈ మొత్తం 601 కోట్లకు చేరింది.
