స్పౌజ్ బదిలీలు చేపట్టాలి : స్పౌజ్ ఫోరం ప్రతినిధులు

స్పౌజ్ బదిలీలు చేపట్టాలి : స్పౌజ్ ఫోరం ప్రతినిధులు
  • మంత్రులకు స్పౌజ్ ఫోరం ప్రతినిధుల వినతి 

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317తో వేర్వేరు జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలను ఒకే జిల్లాకు మార్చేలా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ తదితరులను కలిసి వినతి పత్రాలు అందించారు. 

ప్రజావాణిలోను బదిలీల అంశాన్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు ఎస్. వివేక్, నరేష్, త్రివేణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. జనవరిలో కేవలం 615 మంది స్పౌజ్ టీచర్లను బదిలీలు చేశారని, ఇంకా 1500 మందివి పెండింగ్ లో ఉన్నాయని వివరించారు.