రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ దేశంలో ఉత్పత్తి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. తమ దేశాధ్యక్షుడు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుని దేశప్రజలకు భరోసా కల్పిస్తారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ కసరత్తులు అన్నీ పూర్తిచేస్తారని తర్వాత ఆయన బహిరంగంగానే వ్యాక్సిన్‌ తీసుకుంటారని రోషియావన్‌ టివి ఛానల్‌ ప్రసారం చేసింది. ఈ నెలలోనే స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ స్వఛ్చంద ప్రయోగాలను రష్యా ప్రవేశపెట్టింది. ఇవాళ్టి(సోమవారం)నుంచి 60 ఏళ్లు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. 68 ఏళ్ల పుతిన్‌.. ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ మరింత పటిష్టమైనదని, అన్ని వయసుల వారు వినియోగించవచ్చని భరోసా ఇచ్చారు. అంతేకాదు..ఆగస్టులోనే తన కుమార్తెల్లో ఒకరు క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పుతిన్‌ గుర్తుచేసారు.