శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 27న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సాంగ్స్, హీరోయిన్స్, కామెడీ లేకుండా తెలుగులో రూపొందిన అరుదైన థ్రిల్లర్ ఇది. చాలా కొత్తగా ఉంటూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూస్తారని దర్శక నిర్మాతలు చెప్పారు.
