హైదరాబాద్: యాంకర్ అనసూయపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనసూయపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి అని తెలిపారు.
🚔 𝐂𝐑𝐀𝐂𝐊𝐃𝐎𝐖𝐍 𝐎𝐍 𝐂𝐘𝐁𝐄𝐑 𝐁𝐔𝐋𝐋𝐘𝐈𝐍𝐆 🚔
— Cyberabad Police (@cyberabadpolice) April 20, 2026
The @CyberCrimesCyb Police have apprehended an individual for targeting actress Anasuya Bharadwaj with defamatory and obscene social media content.
𝐐𝐮𝐢𝐜𝐤 𝐂𝐚𝐬𝐞 𝐅𝐚𝐜𝐭𝐬:
𝐓𝐡𝐞 𝐀𝐫𝐫𝐞𝐬𝐭: Dorepalli Chanti… pic.twitter.com/mLQLVuTw3G
డిసెంబర్ 23వ తేదీ 2025 నుంచి సోషల్ మీడియా వేదికగా కొందరు తనపై అసభ్య దూషణలు, అభ్యంతకర వ్యాఖ్యలతో తన ప్రతిష్టకు భంగం కలిగిస్తు్న్నారని, సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారని అనసూయ భరద్వాజ్ ఇటీవల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు చంటిపై.. BNS సెక్షన్లు 75, 79, 336(4), 351, 356, ఐటీ చట్టం, 2000–2008లోని సెక్షన్లు 66E, 67 కింద కేసు నమోదు చేశారు.
►ALSO READ | అల్లు అర్జున్ '30 పైసలు' ఫార్ములా.. రెమ్యునరేషన్ విషయంలో బన్నీ గ్రేట్ డెసిషన్!
నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం, ఆల్వాల గ్రామానికి చెందిన దొరపల్లి చంటికి.. @chantidhorapally అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. నిందితుడు సోషల్ మీడియా వేదికలపై అనసూయను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు అనసూయ భరద్వాజ్ కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియా యూజర్లు బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తనను పాటించాలని, వ్యక్తిగత దూషణలకు, పరువు తీసే లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

