V6 News

జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నడో.. తెలంగాణ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్‎లో చేరిండు: కేసీఆర్

జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్నడో.. తెలంగాణ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్‎లో చేరిండు: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో తనకు స్నేహం ఉందని.. భిన్న రాజకీయ పార్టీల వల్లే వేర్వేరుగా పని చేశామని చెప్పారు. జీవన్ రెడ్డి ప్రజాజీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. 

సోమవారం (ఏప్రిల్ 20) జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా జీవన్ రెడ్డితో తనకు స్నేహం ఉందని.. భిన్న రాజకీయ పార్టీల వల్లే వేర్వేరుగా పని చేశామని చెప్పారు. జీవన్ రెడ్డి ప్రజాజీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. జీవన్ రెడ్డికి జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని అన్నారు. 

అన్నదమ్ముల్లాగా పని చేద్దామని జీవన్ రెడ్డితో చెప్పానన్నారు. జీవన్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని.. ఆయన ఒక్క కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పని చేయాలన్నారు. నూటికి నూరు శాతం తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో జీవన్ రెడ్డి కీలక స్థానంలో ఉంటారని.. తాను మాట ఇస్తే తప్పనని అన్నారు.